News January 29, 2026

VKB: ఇంటర్ పరీక్షలు రాయనున్న 16,400 మంది

image

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 16,400 మంది విద్యార్థులు హాజరుకానుండగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 4, 2026

MBNR: ఖతర్‌లో చిక్కుకున్న డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి

image

గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన యువ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి పెళ్లి నిశ్చయం కావడంతో కెనాడ నుంచి ఇండియాకు బయలుదేరాడు. అరబ్ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఖతార్‌లో చిక్కుకుపోయాడు. దీంతో ఇంట్లో మార్చి 1న జరగాల్సిన ప్రీ వెడ్డింగ్, ఇంటి దైవాల కార్యక్రమాలు వాయిదా వేశారు. కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News March 4, 2026

MHBD: స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి నేడే చివరి తేదీ

image

క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేది అని మహబూబాబాద్ జిల్లా క్రీడాధికారిని ఓలేటి జ్యోతి తెలిపారు. ఈ నెల 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in చేసుకోవాలన్నారు.

News March 4, 2026

MP మద్యం తాగొచ్చి గొడవ చేశారు: MLA కొలికిపూడి

image

MP చిన్నిపై తిరువూరు MLA కొలికిపూడి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గంలోని ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది లోకల్ MLA కాగా, ఉద్దేశపూర్వకంగా MP, అతని అనుచరులు గంపలగూడెం నెమలి ఆలయంలో ఓవరాక్షన్ చేశారన్నారు. M అంటే మట్టి, P అంటే పేకాటగా పదవిని మార్చేశారని కొలికిపూడి ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో వ్యాఖ్యానించారు. ఉత్సవాల్లో MP, ఆయన అనుచరులు మద్యం తాగి ప్రవర్తించారన్నారు.