News January 29, 2026

జనవరి 29: చరిత్రలో ఈరోజు

image

1912: సుప్రీంకోర్టు 14వ ప్రధాన న్యాయమూర్తి అజిత్ నాథ్ రే జననం
1936: సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం (ఫొటోలో)
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: జర్నలిస్టు, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జననం
2003: నటి పండరీబాయి మరణం
* జాతీయ పజిల్ దినోత్సవం

Similar News

News February 21, 2026

ట్రంప్‌కు బొమ్మ చూపించాడు!

image

విదేశాలపై టారిఫ్స్ వేసే అధికారం USA అధ్యక్షుడికి లేదని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పడం తెలిసిందేగా. USAలోని చిన్న బొమ్మల కంపెనీ ఓనర్ రిక్ ఈ తీర్పు కోసం పోరాడారు. తన లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ చైనా నుంచి టాయ్స్ కొని USAలో వ్యాపారం చేస్తుంది. ట్రంప్ టారిఫ్స్‌తో నష్టపోయిన రిక్, తనలాంటి వ్యాపారులతో కలిసి కోర్టుకెళ్లి కేసు గెలిచారు. తమ నుంచి వసూలు చేసిన అదనపు సుంకం ఇవ్వాలనేది రిక్ తాజా డిమాండ్.

News February 21, 2026

తిరుమలలో శ్రీవారికి నిర్వహించే పూజలివే..

image

ఏడు కొండలపై కొలువైన శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తారు. సుప్రభాతంతో మేల్కొలుపు, తోమాలతో పూల అలంకరణ, అర్చనతో నామస్మరణ నిర్వహిస్తారు. మలయప్పస్వామికి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి వైభవ సేవలు జరుగుతాయి. వారంలో ఒకరోజు అభిషేకం, తిరుప్పావడ, నిజపాద దర్శనం వంటి విశేష సేవలు ఉంటాయి. చివరగా రాత్రి ఏకాంత సేవతో పవళింపు జరిపి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.

News February 21, 2026

‘కావేరి వామన్’ అరటి రకం ప్రత్యేకతలు

image

ప్రస్తుతం ఎక్కువగా సాగవుతున్న గ్రాండ్ నైన్(G9) అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో ‘కావేరి వామన్‌’ రకం రూపొందించారు. ఈ చెట్టు ఎత్తు కేవలం 4.9 నుంచి 5.25 అడుగులే ఉంటుంది. దీని గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తులో ఉండే ఈ గెలలో 8–10 పండ్ల హస్తాలుంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. ఒకటిన్నర నెలల ముందే గెల కోతకొస్తుంది. పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగుకు అనుకూలం.