News January 29, 2026

యాదాద్రి మున్సిపల్ బరిలో లోక్‌దళ్ పూర్తి పోటీ

image

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ పోటీ చేస్తుందని జిల్లా అధ్యక్షుడు బీరప్ప తెలిపారు. బుధవారం చౌటుప్పల్‌లో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ సాధికారతే లక్ష్యమని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 20, 2026

VZM: మద్యానికి బానిసైన వ్యక్తి అత్మహత్య

image

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. 1టౌన్ ఎస్ఐ ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్(28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించేవాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై శ్రీనివాస్ గురువారం ఇంట్లో ఉరేసుకొన్నాడు. మృతుడుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 20, 2026

సిద్ధిపేటలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

image

పదో తర్వాత విద్యార్థులు ఎలాంటి మార్గం వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఇవాళ సాయంత్రం.6 గంటలకు సదస్సు జరగనుంది. CBI Ex జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

News February 20, 2026

నేను సంపాదిస్తాను.. నువ్వు క్రికెట్ ఆడు: వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ

image

టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సక్సెస్ వెనక భార్య నేహా ఖేడేకర్ త్యాగం మరువలేనిది. వీరిద్దరి లవ్‌స్టోరీ SRM వర్సిటీలో మొదలైంది. ఆర్కిటెక్ట్ జాబ్ వదిలేసి క్రికెట్ వైపు వెళ్లాలని వరుణ్ అనుకున్నప్పుడు నేహ కొండంత అండగా నిలిచారు. ‘నీకు జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను సంపాదిస్తాను. నువ్వు క్రికెట్ ఆడు’ అని ధైర్యమిచ్చారు. భవిష్యత్తుపై భరోసా లేక తనను వివాహం చేసుకోవద్దని వరుణ్ చెప్పినా ఆమె వినలేదట.