News January 29, 2026

జూన్‍‌నాటికి పేదలకు 2.61లక్షల ఇళ్లు: మంత్రి

image

AP: అర్హులందరికీ 2029నాటికి పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘జూన్‌నాటికి 2.61 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నాం. దరఖాస్తు చేసుకున్న 10లక్షల మందిలో 7.5లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేశాం. వాళ్లందరికీ 2029నాటికి శాశ్వత గృహాలు, మిగిలిన 2.5లక్షల మందికి స్థలాలు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి తెలిపారు.

Similar News

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

News February 12, 2026

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.