News January 29, 2026

సంగారెడ్డి: FIRST DAY 99

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డు స్థానాలకు తొలి రోజు 99 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్- 46, బీఆర్ఎస్-28, బీజేపీ- 18, బీఎస్పీ-1, ఇండిపెండెంట్లు-6 నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 30వ తేదీ వరకు ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశారు.

Similar News

News January 30, 2026

అభ్యర్థులను ఖరారు చేయని రాజకీయ పక్షాలు

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఖరారు చేసే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉండనుండగా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించాయి. ప్రధానంగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకపోవడంతో ‘భీ’ ఫారాలు అందజేయలేదు.

News January 30, 2026

భార్యాభర్తలకు గ్రూప్-2 ఉద్యోగాలు

image

బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన దంపతులు బాణా విజయచంద్రా రెడ్డి, శరణ్య గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వీరు కష్టపడి తమ కలలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న శరణ్య ఏఎస్ఓ (ASO)గా ఎంపిక కాగా, భర్త విజయచంద్రా రెడ్డి సైతం అదే ఉద్యోగం సాధించారు. వీరిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

News January 30, 2026

పిల్లల్ని పట్టించుకుంటున్నారా?

image

ఈరోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగం, పని ఒత్తిడిలోపడి తమ చిన్నారుల కోసం సమయం కేటాయించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు తమ ఆనందాలు, బాధలు, ఒత్తిడులను తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతున్నారు. అందుకే పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడి వారి ఆనందాలను, బాధలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.