News January 29, 2026

నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు

image

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ఉ.11 గంటలకు జరగనున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. పవార్ అంత్యక్రియలకు PM మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, MH సీఎం ఫడణవీస్, AP మంత్రి లోకేశ్ హాజరవనున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ సహా ఐదుగురు మరణించారు.

Similar News

News February 7, 2026

మారుతీ సుజుకీకి షాక్‌.. చిన్న కార్ల రాయితీ ప్రతిపాదన రద్దు

image

చిన్న కార్లపై (909 కేజీలు లేదా అంతకంటే తక్కువ బరువు ఉండేవి) రాయితీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో మారుతీ సుజుకీకి ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్లో దాదాపు 95% చిన్న కార్లు మారుతీవే ఉన్నాయి. దీంతో రాయితీ ఎక్కువగా ఒక సంస్థకే లాభం చేకూరుస్తుందన్న ఇతర కంపెనీల అభ్యంతరాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందిస్తున్న CAFE-III రూల్స్ 2027 ఏప్రిల్‌లో అమల్లోకి రానున్నాయి.

News February 7, 2026

బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

image

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.

News February 7, 2026

పేరెంట్స్‌ను చూసుకోవడానికి 45 రోజుల సెలవు ఇవ్వాలి: ఎంపీ

image

60 ఏళ్లు నిండిన పేరెంట్స్‌ను చూసుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులకు 45 రోజుల సెలవు ఇవ్వాలని UP MP సుమిత్ర రాజ్యసభలో ప్రతిపాదించారు. ‘ప్రస్తుతం దేశంలో సీనియర్ సిటిజన్‌ల సంఖ్య 14.9Crగా ఉంది. 2036 నాటికి ఈ సంఖ్య 23Cr దాటుతుంది. ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడు ఉంటారు. ప్రస్తుతం ఉద్యోగ ఒత్తిళ్లతో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే సెలవులివ్వాలి’ అని పేర్కొన్నారు.