News January 29, 2026

గూగుల్ డేటా సెంటర్‌కు FEBలో శంకుస్థాపన!

image

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు పనులు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. FEBలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగే అవకాశాలున్నాయన్నారు. ఆనందపురం(M) తర్లువాడ వద్ద డేటా సెంటర్ కోసం 308 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు తెలిపారు. భూసేకరణలో 51 మంది డీపట్టా రైతుల్లో 49 మంది భూములిచ్చేందుకు అంగీకరించారని, మిగిలిన వారు 2-3 రోజుల్లో ఇవ్వనున్నట్లు చెప్పారు.

Similar News

News March 5, 2026

విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.

News March 5, 2026

సెమీస్.. భారత్ భారీ స్కోర్

image

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.

News March 5, 2026

బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

image

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్‌ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్‌’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.