News January 29, 2026
NLG: కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నేపథ్యం ఇదే..

NLG కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశారు.
పేరు: బుర్రి చైతన్య
భర్త: శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్
కుమారులు: ఇద్దరు
తల్లిదండ్రులు: బండ సరోజ, అంజిరెడ్డి
పదవులు: 2011 నుంచి 2018 వరకు రామాలయం ఛైర్మన్‌గా, 2020 నుంచి 2025 వరకు 33వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.
Similar News
News February 6, 2026
నల్గొండ: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకోసం అన్ని మున్సిపాలిటీల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 6, 2026
నల్గొండ: ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
News February 6, 2026
ఓటు వేయాలంటే ‘గుర్తింపు’ ఉండాల్సిందే: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం ఓటర్లు సిద్ధం కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఈ నెల 11న జరిగే పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలను చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు.


