News January 29, 2026

TU: బీఈడీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్పు.!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (B.Ed) మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రీ పోన్ చేసినట్లు సీఓఈ (COE) ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి ఫేజ్ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు, రెండో ఫేజ్ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత ప్రతులను ఈనెల 29లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు.

Similar News

News February 14, 2026

NZB: 16న మేయర్ ఎన్నిక కోసం ఏర్పాట్లు

image

ఈ నెల 16న (సోమవారం) నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. NZB ACP ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. కాగా మొదట మేయర్ ఎన్నిక జరుగుతుంది. తదనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది.

News February 14, 2026

NZB: మేయర్ బరిలో బీసీ అభ్యర్థులు..!

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శమంత పేరు వినిపించినప్పటికీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు తాజాగా బీసీ నినాదంతో 2 కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి (ముదిరాజ్), 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేర్లు వినిపిస్తున్నాయి.

News February 14, 2026

దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

image

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.