News January 29, 2026
మొక్కజొన్న పంటలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

మొక్కజొన్న పైరు ఒకవేళ 60 నుంచి 65 రోజుల దశలో ఉంటే పంటకు అవసరం మేర ఎరువులను అందించాలి. ఈ సమయంలో చివరి దఫా నత్రజని ఎరువుగా ఎకరాకు 50 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. పూత దశకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో పైరుకు నీటి తడులను తప్పనిసరిగా అందించాలి. నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
Similar News
News February 20, 2026
DRDOలో JRF పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బెంగళూరు <
News February 20, 2026
కేవలం ఒకే చెంపదెబ్బ క్రూరత్వం కాదు: గుజరాత్ HC

తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి, రాత్రంతా అక్కడే ఉన్నందుకు భార్యను భర్త ఒక్కసారి చెంప దెబ్బ కొట్టడం IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కాదని గుజరాత్ HC వ్యాఖ్యానించింది. ఓ కేసులో 23 ఏళ్ల తర్వాత భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. భార్య ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండాలని, కేవలం ఒక్క సంఘటనను క్రూరత్వంగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.
News February 20, 2026
ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

☛ నిన్ను నిర్లక్ష్యం చేసే చోట ఎదురుచూడటం ఆపేయ్.
☛ నీ భావాలకు విలువ లేని చోట వాటిని వ్యక్తపరచకు.
☛ నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి దేనికోసం పాకులాడకు.
☛ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఎవరినీ ప్రేమించకు.
☛ నిన్ను తక్కువ చేసి చూసే చోట చొరవ తీసుకోకు.
☛ జాలితో ఇచ్చే పలకరింపుల కోసం, ప్రేమ కోసం ఆశపడకు.
☛ నువ్వు భారమని అనుకునే చోట నీ మనసులోని భావాలను పంచుకోకు.


