News January 29, 2026
నిజామాబాద్‌లో MIM కీ ‘రోల్’

నిజామాబాద్‌లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు AIMIM ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించిన MIM.. 28 స్థానాలు సాధించిన BJPకి చెక్ పెడుతూ 13 స్థానాలు సాధించిన BRSతో పొత్తు పెట్టుకుంది. దీంతో మొహమ్మద్ ఇద్రీస్ ఖాన్ (AIMIM) డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవగా ఈ సారి కూడా తమ సత్తా చాటాలని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
Similar News
News February 1, 2026
NZB: ఆపరేషన్ స్మైల్‌తో 161 మంది పిల్లల గుర్తింపు

నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్:XII లో భాగంగా ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 161 మంది తప్పిపోయిన బాలబాలికలకు రెస్క్యూ చేసినట్లు సీపీ సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటు మొత్తం 52 FIRలు నమోదు కాగా అందులో నిజమాబాద్: 15, ఆర్మూర్: 23, బోధన్ డివిజన్‌లో 14 చొప్పున నమోదు అయినట్లు వివరించారు.
News February 1, 2026
NZB: లెక్క తేలింది.. మిగిలేది ఎవరో?

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల లెక్కను అధికారులు తేల్చారు. శనివారం జరిపిన స్క్రూటినీలో అభ్యర్థుల సంఖ్య తేలింది. 60 వార్డులకు 647 మంది అభ్యర్థులకు సంబంధించి 787 నామినేషన్లు మిగిలాయి. తన అభ్యర్థుల పేర్లను కొన్నింటిని ఖరారు చేయగా కాంగ్రెస్ ఇప్పటికీ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. విత్ డ్రా సమయం మరో రెండు రోజులు ఉంది. దీనితో ఎవరు ఉంటారో? రెబల్ చేస్తారో? మిగిలేది ఎవరో? ఉత్కంఠగా మారింది.
News February 1, 2026
NZB: అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు రిషెడ్యూల్

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (1, 3, 5 సెమిస్టర్లు) పరీక్షల షెడ్యూల్‌ను సవరించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 28 వరకు జరగాల్సిన పరీక్షలను.. అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.braouonline.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.


