News April 28, 2024
రేపటి నుంచి బీజేపీ వీధి సభలు

AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు గాను వీధి సభలను(కార్నర్ మీటింగ్స్) నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. రేపటి నుంచే ఈ సభలు మొదలవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గానికి పది చొప్పున 50 నియోజకవర్గాల్లో 500 వరకు ఈ సభల్ని నిర్వహిస్తామని పేర్కొన్నాయి. వీటి ద్వారా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని స్పష్టం చేశాయి.
Similar News
News March 16, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. SKLM, VZM, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
– ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.
News March 16, 2026
నటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోయిన సిద్ధార్థ్

నటి ప్రత్యూష డెత్ <<19164468>>కేసులో<<>> నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని 4 వారాల క్రితం తీర్పునిచ్చింది. దీంతో అతడు ఈరోజు లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
News March 16, 2026
SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ!

IPL: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


