News January 29, 2026

మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఢమాల్

image

మదనపల్లి జిల్లా కేంద్రంలో టమోటా ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. కేవలం 74 వేల కిలోలు (74మెట్రిక్ టన్నులు) మాత్రమే వచ్చాయి. వ్యాపారులు మాత్రం 10 కిలోల మొదటి రకం టమాటాలను రూ.150, రెండో రకం టమాటా రూ.140, మూడో రకం టమాటా రూ.130 తో కొనుగోలు చేసి రైతులను తీవ్ర నిరాశకు గురిచేశారు. రేట్లు పతనం అవడంతో గిట్టుబాటు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 3, 2026

8 మంది ఎంపీల సస్పెన్షన్.. లోక్‌సభ రేపటికి వాయిదా

image

విపక్ష ఎంపీల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. తనపై పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సెషన్‌ మొత్తం వారిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్‌తోపాటు హిడీ ఈబెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు.

News February 3, 2026

2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కేటీఆర్

image

TG: నిరుద్యోగుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగలడం ఖాయమని KTR హెచ్చరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ ముఖం చాటేశారని ఫైరయ్యారు. అలాగే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని చెప్పిన మాట అటకెక్కిందని దుయ్యబట్టారు. 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు.

News February 3, 2026

నంద్యాల: 1930 గురించి తెలుసుకోండి.. చాలా ఉపయోగం!

image

ఆన్‌లైన్, బ్యాంక్, OTP, UPI/ATM/క్రెడిట్ కార్డు స్కామ్‌లు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసింది. ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోసానికి గురైనప్పుడు 1930కి కాల్ చేస్తే బ్యాంక్‌కు అలర్ట్ పంపిస్తారు. https://cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.