News April 28, 2024

HYD: భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

image

భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్‌ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్‌ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 12, 2025

HYD: విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సప్ గ్రూప్

image

బంజారాహిల్స్ డివిజన్లో విద్యుత్ అధికారులు సమస్య పరిష్కారానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఇక్కడ 195 ఫీడర్లుండగా ఆ వినియోగదారులతో కలిపి 195 వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యను గ్రూపులో పోస్టు చేస్తే వెంటనే సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారు. గ్రూపుల్లో సిబ్బందితోపాటు 30 మంది అధికారులు కూడా ఉంటారు. వీటితోపాటు 1912 సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

News September 12, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ నవంబర్‌లో

image

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ నవంబర్ 25 నుంచి జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News September 12, 2025

HYD- గోవాకు ఎగిరిపోదాం పదా బ్రో

image

పర్యాటక ప్రేమికుల కోసం IRCTC కొత్త ఎయిర్ ప్యాకేజీలు ప్రకటించింది. HYD నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లనుంది. 4, 5, 6, 8 రోజుల ప్యాకేజీలు తీసుకొచ్చింది. గోవా, గుజరాత్, కశ్మీర్, మేఘాలయ, కర్ణాకట, అండమాన్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలను చూపించనుంది. వీటితోపాటు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. వివరాలకు 040-27702407, 9701360701 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.