News April 28, 2024

సీఎస్‌పై గవర్నర్‌ నజీర్‌కు ఫిర్యాదు

image

ఏపీ సీఎస్, పింఛన్ల పంపిణీ వ్యవహారంపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో సీఎస్ జవహర్ రెడ్డి పని చేస్తున్నారని టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, జనసేన నేత శంకర్ ఆరోపించారు. పింఛన్ల పంపిణీలో సీఎస్ బాధ్యతగా స్పందించలేదని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఇంటికే వెళ్లి పెన్షన్ అందించేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

Similar News

News January 15, 2026

దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

image

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.

News January 15, 2026

NTVపై చర్యలకు కారణం ఇదేనా?

image

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.

News January 15, 2026

సూర్య మూవీకి రూ.85 కోట్ల OTT డీల్!

image

హీరో సూర్య, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.85 కోట్లకు OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యధికమని సమాచారం. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య లాస్ట్ మూవీ ‘రెట్రో’ పెద్దగా ఆకట్టుకోకపోయిన మార్కెట్‌లో డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.