News January 29, 2026

HYD: వీకెండ్‌లో బెస్ట్ డెస్టినేషన్‌.. జింకల పార్కు

image

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.

Similar News

News February 19, 2026

గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

image

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 19, 2026

ఆ 2 హామీల అమలుపై ఖర్గే, రాహుల్ ఆరా

image

TG: AICC నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. మ్యానిఫెస్టోలోని వృద్ధాప్య పెన్షన్ ₹4000కు పెంపు, మహిళలకు ₹2500 ఆర్థిక సాయం అమలుపై వారు ఆరా తీశారు. పథకాలపై సమీక్షలో వీటిపై అడగగా రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి CM రేవంత్ వారికి వివరించారు. బడ్జెట్లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం వివరించినట్లు పార్టీవర్గాలు పేర్కొన్నాయి.

News February 19, 2026

ADB: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC సంక్షేమ శాఖ అధికారిణి సునీత కుమారి పేర్కొన్నారు. ఈ – పాస్ ఆన్ లైన్‌లో మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.