News January 29, 2026

కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్: మంత్రి సవిత

image

AP: తిరుమల వేంకన్న ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. పామాయిల్, ఇతర కెమికల్స్‌తో లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యి లేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. జంతుకొవ్వు లేదు కదా అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి YCP బ్యాచ్ బుకాయిస్తోందని ఫైరయ్యారు. కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్ అని, కల్తీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

Similar News

News February 19, 2026

దోసకాయ బంగారమాయె.. రష్యాలో కిలో రూ.355

image

నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయలు కిలో 300 రూబల్స్(₹355) చొప్పున అమ్ముతున్నారని, కొన్నిచోట్ల 2, 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం మాంసంతో సమానంగా ధర ఉంటోందని చెబుతున్నారు. దోసకాయలే ఇప్పుడు తమకు బంగారంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.

News February 19, 2026

బెండలో పేనుబంక వల్ల కలిగే నష్టాలేమిటి?

image

బెండ పంటను పేనుబంక పురుగులు ఆశిస్తే ఆకులు, రెమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పేనుబంక పురుగులు ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీని వల్ల నల్లటి బూజు తెగులు ఆశిస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంది.

News February 19, 2026

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>IRCON <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 13 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech (సివిల్, EE, EEE, ECE, EIE)అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ircon.org.