News January 29, 2026
‘ఫేర్‌వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్‌లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 17, 2026
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. ఎక్కడుందంటే?

గుజరాత్‌లోని మాదాపర్ సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ 17కు పైగా బ్యాంక్ శాఖలు ఉండటం విశేషం. ఇక్కడి కుటుంబీకులు విదేశాల్లో స్థిరపడినా తమ సంపాదనను సొంత ఊరి బ్యాంకుల్లోనే పొదుపు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. వీరి పొదుపు మంత్రం, పుట్టిన ఊరిపై ఉన్న మమకారం ప్రతి గ్రామానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
News February 17, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి విషపు ఎర తయారీ విధానం

మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో సాయంకాలం వేయాలి. దీని కోసం ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని 2-3 లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తవుడులో కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటల పాటు పులియనిచ్చి, అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎరను మొక్క సుడిలో వేయాలి.
News February 17, 2026
అల్లు అర్జున్‌కు క్షమాపణలు చెప్పిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి

అల్లు అర్జున్‌ను కలవాలంటే <<19101939>>42 రూల్స్<<>> పాటించాలని తాను చేసిన వ్యాఖ్యలపై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా సారీ చెప్పారు. ‘పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతుండగా ఫ్లోలో ఆ వ్యాఖ్యలు చేశా. అందులో నిజం లేదు. “42 డూస్, డోంట్స్” డాక్యుమెంట్ అబద్ధం. నాకు ఎవరూ ఇవ్వలేదు’ అని బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ఆ పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి కూడా పబ్లిక్‌గా అపాలజీ చెప్పారు. కాగా అంతకుముందు ఈ ఆరోపణలను బన్నీ టీమ్ <<19103408>>ఖండించింది<<>>.


