News January 29, 2026
రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రిటైర్‌మెంట్ ప్రకటించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన ప్రయాణానికి పూర్తి భిన్నమైన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. WBకు చెందిన ఆయన కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలను పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోరని సమాచారం.
Similar News
News February 16, 2026
అస్సాం, WB ఎన్నికలపై బంగ్లా పరిణామాల ప్రభావం

దేశ సరిహద్దులోని బంగ్లా ఎన్నికల ప్రభావం అస్సాం, WB అసెంబ్లీ ఎలక్షన్లపై ఏమేరకు ఉంటుందన్నది చర్చగా మారింది. మొత్తం జనాభాలో ముస్లింలు అస్సాంలో 40%, WBలో 30% ఉన్నారు. వీరిలో అక్రమ వలసదారులే అధికం. బంగ్లాలో ఏ పరిణామం చోటుచేసుకున్నా ఆ ప్రభావం ఈ రాష్ట్రాలపై పడుతోంది. బంగ్లా హిందువులపై దాడులను BJP 2 రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా చేసుకుంది. అయితే అక్కడ BNP అధికారంలోకి రావడంతో మార్పు ఉంటుందేమో చూడాలి.
News February 16, 2026
సంచలనం.. ఒకే ఫార్మాట్లో 700 వికెట్లు

అఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ T20 క్రికెట్‌లో సంచలనం నమోదు చేశారు. T20WCలో భాగంగా ఇవాళ UAE బ్యాటర్ అర్ఫాన్‌ను ఔట్ చేయడంతో ఈ ఫార్మాట్‌లో 700 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అన్ని లీగ్స్‌లో కలిపి ఈ ఘనత సాధించారు. అఫ్గాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 191వ వికెట్. కాగా ఓవరాల్ వికెట్ల జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(వెస్టిండీస్-631), నరైన్(వెస్టిండీస్-613*) ఉన్నారు.
News February 16, 2026
పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

పీరియడ్స్‌లో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.


