News April 28, 2024
శ్రీకాకుళం: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్

పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు సంబంధించి శనివారం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 26 కేంద్రాల్లో 7,195 మందికి 6,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. టెక్కలి డివిజన్‌లోని 16 కేంద్రాల్లో 4,816 మంది విద్యార్థులకు గాను 4,362 మంది హాజరయ్యారు. మొత్తంగా 90.37శాతం హాజరైనట్టు జిల్లా సమన్వయకర్తలు గురుగుబెల్లి దామోదరరావు, గోపి తెలిపారు.
Similar News
News March 2, 2026
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 అర్జీలు

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 56 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News March 2, 2026
SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి’

మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అధికంగా రాజీలు చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.
News March 2, 2026
SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకి 895 మంది హాజరు

జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు, అక్రమాలకు తావులేకుండా ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు.


