News January 30, 2026

కేజిన్నర బంగారం.. 8.7 కేజీల వెండి.. రెవెన్యూ ఉద్యోగి ఆస్తుల చిట్టా!

image

AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి తిరుమలేశ్‌ను ACB అరెస్టు చేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. 11 ఆస్తి పత్రాలు, 1.47KGs బంగారం, 8.77KGs వెండి, ₹15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్‌లో అతడు సస్పెండైనట్లు తెలుస్తోంది.

Similar News

News March 12, 2026

ఇవాళ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. అర్హతలివే

image

గుంటూరులోని ANUలో ఇవాళ AP, ఈ నెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు కలర్ ఫొటోలు తీసుకువెళ్లాలి. 6AM-10AM లోపు ANUకు చేరుకోవాలి.

News March 12, 2026

త్వరలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి?

image

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవతో ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్ ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఇటీవల విజయ్-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహాలు జరగగా, త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యా రెడ్డి ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే.

News March 12, 2026

16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

image

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.