News January 30, 2026
UGC కొత్త రూల్స్ ఏంటి? వివాదం ఎందుకు?(1/2)

విద్యాసంస్థల్లో వివక్షను ఆపడమే లక్ష్యంగా UGC కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. వర్సిటీల్లో Equal Opportunity Centre (EOC) ఏర్పాటు చేయాలి. SC, STలతో పాటు కొత్తగా OBC, EWS విద్యార్థులకూ రక్షణ కల్పించాలి. కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లోపు EOC సమావేశమవ్వాలి. 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. అలాగే కొత్తగా మరికొన్ని యాక్షన్స్‌నూ Discriminationగా గుర్తిస్తూ వివక్ష నిర్వచనాన్ని మార్చారు.
Similar News
News February 22, 2026
హీరో విజయ్ పోటీ ఎక్కడి నుంచంటే?

TNలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVK చీఫ్ విజయ్ పోటీ చేసే ప్రాంతంపై ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున క్లారిటీ ఇచ్చారు. నార్త్ చెన్నైలోని ఓ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్నారు. కాగా నార్త్ చెన్నై వెనుకబాటుకు DMK కారణమని TVK ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తూ ఇక్కడి నుంచి పోటీకి విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 22, 2026
దారుణం.. బాలికపై టీచర్ల అత్యాచారం!

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే కామాంధులుగా మారారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నలుగురు టీచర్లు, ఓ ప్యూన్ 12 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. ఇంట్లో ఒంటరిగా ఏడుస్తున్న కూతురిని తల్లి ప్రశ్నించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 22, 2026
BREAKING: శ్రీలంకకు బిగ్ షాక్..6 ఓవర్లకే 5 వికెట్లు డౌన్

T20WC: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. 6 ఓవర్ల లోపే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఔటైన బ్యాటర్లలో వెల్లలాగే చేసిన 10 పరుగులే అత్యధికం. విల్ జాక్స్ 3, ఆర్చర్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం 7 ఓవర్లకు శ్రీలంక స్కోర్ 37-5. 147 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగింది.


