News January 30, 2026
రాష్ట్రానికి రూ.128.43 కోట్ల NHM నిధులు

AP: జాతీయ ఆరోగ్య మిషన్ చివరి విడత కింద ఆయా జిల్లాలకు ప్రభుత్వం రూ.128.43 కోట్లను విడుదల చేసింది. FEB 20లోగా వీటిని ఖర్చు చేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా గుంటూరుకు రూ.20.61 కోట్లు, నెల్లూరుకు రూ.8.60 కోట్లు, కృష్ణాకు రూ.6.21 కోట్లు ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
Similar News
News February 21, 2026
యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్‌పై భారత్ ఫోకస్

ఈ నెల 25, 26 తేదీల్లో PM మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక, రక్షణ సంబంధాలపై చర్చ జరగనుంది. మోదీ గతంలో ప్రకటించిన ‘మిషన్ సుదర్శన్’లో భాగంగా యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి, లేజర్ ఆయుధాలు, లాంగ్‌రేంజ్ మిస్సైల్స్‌పై ఫోకస్ చేయనున్నారు. ఈ రంగాల్లో $10bn డిఫెన్స్ ట్రేడ్‌కు పునాదులు పడనున్నాయి. అలాగే ఆ దేశ PM నెతన్యాహుతో కలిసి మోదీ <<19160160>>పార్లమెంటులో<<>> ప్రసంగించనున్నారు.
News February 21, 2026
ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, సి, బి, ఇ, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News February 21, 2026
REWIND: ఆ విషాదానికి 13 ఏళ్లు

నేటితో 2013 హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు. ఆ చీకటి రోజును ఒక్కసారి రివైండ్ చేసుకుంటే.. దిల్‌సుఖ్‌నగర్ రక్తసిక్తమైన దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఉగ్రవాదులు సైకిళ్లపై అమర్చిన బాంబుల ధాటికి 18మంది బలవ్వగా 131మంది గాయపడ్డారు. ఇది భాగ్యనగరానికి ఒక మాయని మచ్చ. ఈ కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు కోర్టు మరణశిక్ష విధించింది. నగరం గతాన్ని మర్చిపోయినా ఆ గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది.


