News April 28, 2024
నేడు నెల్లూరు, కర్నూలుకు చంద్రబాబు

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరులోని కోటమిట్ట వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో ముస్లింలతో ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లా కౌతాళంలో, రాత్రి 7 గంటలకు గూడూరులో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాత్రికి గూడూరులోనే ఆయన బస చేయనున్నట్లు సమాచారం.
Similar News
News January 8, 2026
ఒక్క గుడ్డు ధర లక్ష.. లీటర్ ఆయిల్ 18 లక్షలు!

ఇరాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఆహార పదార్థాల ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం, గుడ్లు వంటి నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయి. కిలో బియ్యం 2.2 లక్షలు, లీటర్ ఆయిల్ 18 లక్షల రియాల్స్‌కు ఎగిశాయి. ట్రే గుడ్లు ఏకంగా 35 లక్షల రియాల్స్ పలుకుతున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర లక్షకు పైనే. వారం రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ 14.7 లక్షలకు చేరడమే ఇందుకు కారణం.
News January 8, 2026
క్రెడిట్ రిపోర్టులో SMA పడిందా? ఇక కష్టమే..

లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో కట్టకపోతే బ్యాంకులు ఆ అకౌంట్‌ను SMA (Special Mention Account)గా గుర్తిస్తాయి. ఇది మీరు దివాలా తీసే ఛాన్స్ ఉందని ఇచ్చే ఒక వార్నింగ్ బెల్. మీ బకాయి 1 నుంచి 90 రోజుల వరకు ఆలస్యమయ్యే కొద్దీ ఇది SMA-0 నుంచి SMA-2కి మారుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఒక్కసారి క్రెడిట్ రిపోర్టులో SMA పడితే భవిష్యత్తులో కొత్త లోన్లు రావడం కష్టమవుతుంది.
News January 8, 2026
‘మున్సిపోల్స్’లో పట్టు కోసం పార్టీల కసరత్తు

TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. సంక్షేమ పథకాల అజెండాతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లనుంది. అటు CM రేవంత్ జిల్లాల్లో సభల్లో పాల్గొంటారు. FEB3-9 మధ్య 9 ఉమ్మడి జిల్లాల్లో ఉండే ఈ టూర్ MBNRలో మొదలవుతుంది. ఇక ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక పెండింగ్ అంశాలతో BRS స్పెషల్ మ్యానిఫెస్టో రూపొందించనుంది. అర్బన్‌లో పట్టుకై BJP సీరియస్‌గా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తోంది.


