News January 30, 2026
బైక్ సైలెన్సర్లు మార్చితే సీజ్ చేస్తాం.. ఎస్పీ హెచ్చరిక

ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలు చేస్తే బైక్‌లను సీజ్ చేస్తామని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. పెద్ద శబ్దాల వల్ల గర్భిణీలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని గురువారం కోరారు.
Similar News
News February 14, 2026
అమరావతిలో రూ.57,868 కోట్లతో పనులు: మంత్రి పయ్యావుల

AP: 2026 మార్చి నాటికి అన్న క్యాంటీన్ల సంఖ్యను 275కు పెంచుతామని మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 204 క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక పేద కుటుంబాలకు 25 లక్షల పట్టాలు/ఇళ్లను అందించి, సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని వివరించారు.
News February 14, 2026
C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.
News February 14, 2026
శివరాత్రికి రాత్రిపూట పూజ ఎందుకు?

పగలు లౌకిక పనులకు, రాత్రి ఆధ్యాత్మిక సాధనకు సంకేతం. శివరాత్రి నాటి లింగోద్భవ కాలం శక్తిమంతమైనది. చీకటి అజ్ఞానానికి ప్రతీక. అయితే శివుడు జ్ఞాన జ్యోతి. రాత్రంతా మేల్కొని చేసే జాగరణ మనలోని తమస్సును తొలగించి పరమాత్మ వైపు నడిపిస్తుంది. మనసు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. నేడు చంద్రుడు క్షీణించి ఉంటాడు. అంటే మనసు అదుపులో ఉంటుంది. ఆ సమయంలో చేసే శివారాధన ఇంద్రియాలను జయించి, శివత్వాన్ని పొందేలా చేస్తుంది.


