News January 30, 2026

విష్ణువు వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు?

image

హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి, భూమిని సముద్ర గర్భంలో దాచాడు. దీంతో సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుంచి అతి చిన్న రూపంలో వరాహ స్వామి ఉద్భవించాడు. క్షణ కాలంలోనే ప్రచండ రూపం దాల్చాడు. లోకోద్ధరణ కోసం సముద్రంలోకి దూకి, హిరణ్యాక్షుడిని సంహరించి, కోరలపై భూమిని నిలిపి పైకి తెచ్చాడు. వేదాలను రక్షించి, భూమిని ఉద్ధరించడమే ఈ అవతార ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత తిరుమలలో కొలువయ్యారు.

Similar News

News February 21, 2026

సిద్దిపేట: ‘అర్రైవ్ అలైవ్’తో ట్రాఫిక్ చైతన్యం

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అర్రైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు రూపొందించి@Siddipet_Police_Commissionerate ను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ్ తెలిపారు.

News February 21, 2026

భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే!

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించేందుకు TGSRTC సిద్ధమైంది. రూ.151 చెల్లించి RTC లాజిస్టిక్ కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్‌లో ఈ నెల 23 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి ప్రకటించారు. భద్రాద్రికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440069కు కాల్ చేయండి. share it

News February 21, 2026

రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో రేపు(FEB 22), ఎల్లుండి(FEB 23) పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. తూ.గో.లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.