News January 30, 2026
విమాన ప్రమాదం.. పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో..

మహారాష్ట్ర Dy.CM <<18990751>>అజిత్ పవార్<<>> విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్లైట్ నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ వేరే పైలట్ స్థానంలో వచ్చినట్లు అతని ఫ్రెండ్స్ తెలిపారు. ‘కొన్ని రోజుల క్రితమే సుమిత్ హాంగ్‌కాంగ్ నుంచి వచ్చారు. పవార్‌ను బారామతి తీసుకెళ్లాల్సిన పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కొన్ని గంటల ముందే సుమిత్‌కు ఆ బాధ్యత అప్పగించారు’ అని పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
Similar News
News February 19, 2026
పాక్‌లో పేలుడు.. 16 మంది మృతి

పాకిస్థాన్ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.
News February 19, 2026
తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.
News February 19, 2026
పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు ఉంటే?

ఇంటికి పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు, లోయలు, గుంతలు, చెరువులు ఉండటం మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. దీనివల్ల ఇంటికి, ఇంట్లోవారికి భవిష్యత్తులో భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ‘మురికి కాలువలు ఇళ్లకు ఏదిక్కున ఉన్నా ఆరోగ్య సమస్యలుంటాయి. నీటి ప్రవాహాలు ఇళ్లకు తూర్పు, ఉత్తర దిశల్లో ఉండాలి’ అంటున్నారు. అన్ని వాస్తు నియమాలకు శాస్త్రీయ జవాబులుండవని స్పష్టం చేస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


