News January 30, 2026
ఈ హైబ్రిడ్ కొబ్బరి రకాలతో అధిక ఆదాయం

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.
Similar News
News February 15, 2026
లవ్లీ హోం హ్యాక్స్..

* చెక్క ఫర్నిచర్‌పై నీటి మరకలు అంత త్వరగా పోవు. అలాంటప్పుడు పేపర్ టవల్‌లో కొద్దిగా మయోనైజ్ రాసి అద్ది తుడిస్తే సరిపోతుంది. * చెత్త డబ్బాలు ఉంచే చోట ఆ దుర్వాసన పోవాలంటే అరకప్పు వెనిగర్ కి, అరకప్పు వంటసోడా కలిపి ఉంచాలి. * వెండి వస్తువులు ఉంచే డబ్బాలో ఓ సుద్దముక్కను కూడా ఉంచితే ఆభరణాలు నల్లబడకుండా ఉంటాయి. * వెనిల్లా పరిమళంలో ముంచిన దూదిని ఫ్రిజ్‌లో ఉంచితే అది దాంట్లోని దుర్వాసనల్ని పీల్చుకుంటుంది.
News February 15, 2026
నిర్జీవంగా వేప చెట్లు.. కారణం ఏమిటి?

పంటలను చీడపీడల నుంచి కాపాడే వేప చెట్లే తెగుళ్ల బారినపడటం కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వేప చెట్ల కొమ్మలు, రెమ్మలు మాడి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఫోమోప్సిస్ అజాడిరక్టే ఫంగస్ వల్లే ఇలా జరుగుతున్నట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఇది ఒక చెట్టు నుంచి మరో చెట్టును ఆశిస్తోంది. అయితే ఇది ఏడాదిలో కొంతకాలం పాటే చెట్లకు సోకుతుందని, మళ్లీ ఈ చెట్లు కోలుకొని మళ్లీ పచ్చగా మారతాయని చెబుతున్నారు.
News February 15, 2026
ఓటుకు అమ్ముడుపోయావా? నీ కోసమే..

TG: ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులను వెనక్కి తీసుకుంటున్నట్లు పలుచోట్ల చూస్తున్నాం. ఇదే లెక్కన డబ్బులిచ్చి గెలిచిన అభ్యర్థులు ఓటర్లకు విలువ ఇస్తారా? అవినీతి లేకుండా పని చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఓటుకు నోటు’ తీసుకున్న వారు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోలేరు. చెప్పుకున్నా ‘అమ్ముుడుపోయారుగా’ అని గెలిచినవాడు లెక్కచేయడు. అందుకే నోటు తీసుకోకుండా ఓటేసి చూడండి. ఆ ధైర్యమే వేరు.


