News January 30, 2026
నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ 12 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech (కెమికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు FEB 11వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal2.nrl.co.in
Similar News
News February 16, 2026
T20 WC: సూపర్-8లో భారత్‌కు టఫ్ ఛాలెంజ్!

T20 WCలో టీమ్‌ఇండియా సూపర్-8లో తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. భారత్‌తో పాటు ఇప్పటికే S-8కి అర్హత సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపు(G1)లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా వస్తే ఈ గ్రూప్ టఫ్‌గా మారనుంది. భారత్ FEB 22న SA, 26న AUS లేదా ZIM, మార్చి 1న WIను ఢీకొట్టొచ్చు. అటు గ్రూపు-2లో SL, PAK, NZ, ENG జట్లు తలపడే అవకాశముంది.
News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
News February 16, 2026
విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.


