News April 28, 2024
30న యర్రగొండపాలెంకు చంద్రబాబు రాక

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30వ తేదీన యర్రగొండపాలెంకు రానున్నారు. ఉదయం 10 గంటలకు నియోజకవర్గాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందగా వారు చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లలో సన్నద్ధమయ్యారు.
Similar News
News September 16, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు కన్వినర్ ప్రసాద్ బాబు మంగళవారం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటికంటే ఎక్కువ ITIలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వ ITIలలో 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
News September 16, 2025
నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్ వెరిఫికేషన్ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.
News September 16, 2025
కొమరోలు: సస్పెండ్ అయిన అధ్యాపకులు వీరే.!

కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అధికారులకు తమ సమస్యలపై <<17721439>>లేఖలు<<>> రాశారు. స్పందించిన RDO పద్మజ కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. జువాలజీ అధ్యాపకుడు సుధాకర్ రెడ్డి, కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రభాకర్, కామర్స్ అధ్యాపకుడు హర్షవర్ధన్ రెడ్డి, బాటని అధ్యాపకుడు లోకేశ్‌లను సస్పెండ్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కిశోర్ కుమార్‌ను ఉలవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటేషన్‌పై పంపారు.