News January 30, 2026

ఫిబ్రవరి 6న OTTలోకి ‘రాజాసాబ్’!

image

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని జియో హాట్‌స్టార్‌ పేర్కొంది. మొత్తం 4 భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. భారీ బడ్జెట్‌తో హారర్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

Similar News

News February 10, 2026

భారీ టార్గెట్‌ను ఊదేశారు

image

T20WC: UAEపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టిమ్(89), ఫిన్ అలెన్(84) బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు. యూఏఈ బౌలర్లు ఎవరూ కివీస్ బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. రొహిద్ ఖాన్, జునైద్‌లు 40+ పరుగులు సమర్పించుకున్నారు.

News February 10, 2026

MLA, MLCలకు క్రీడలు: అయ్యన్న

image

AP: MLA, MLCలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఇవి జరుగుతాయన్నారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, చెస్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. క్రీడలన్నీ అసెంబ్లీ ప్రాంగణంలోనే జరగనున్నాయని తెలిపారు.

News February 10, 2026

రైల్వే జోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి: CBN

image

కొత్త రైలు మార్గాలకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు CM చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందచేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్లపై భేటీలో ప్రస్తావించారు. ‘ద.కో.రైల్వేజోన్ కార్యకలాపాలు APR1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలి. TPT మీదుగా VJA-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీస్ నడపాలి’ అని కోరారు.