News January 30, 2026

IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

<>ఐఐటీ<<>> హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35K,ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-25K చెల్లిస్తారు. ఫిబ్రవరి 17న రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in

Similar News

News February 20, 2026

వచ్చే నెల కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్?

image

మార్చి 9న ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సెషన్‌లో కేంద్రం కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కంపెనీస్ యాక్ట్ (2013), LLP ACT (2008) చట్టాల్లోని రూల్స్‌ను ఈ బిల్లుతో సవరించనుంది. సాంకేతికంగా లేదా కార్యకలాపాల్లో జరిగే చిన్న పొరపాట్లపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తొలగించనుంది. డిజిటైజేషన్‌ ద్వారా పర్యవేక్షణ మెరుగవుతుంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.

News February 20, 2026

పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం తగ్గిన బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,57,370కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,44,250 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 20, 2026

ALIMCO 41 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ALIMCO<<>> 41పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, CA, ICAI, ICWA, LLB, BCom, MBA/PGDM, డిగ్రీ(ప్రొస్థటిక్స్&ఆర్థోటిక్స్), ఆడియాలజీ&స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://alimco.in