News January 30, 2026
GNT: సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్

గుంటూరు పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు చేరుకున్న సీఎంకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ అన్సారియా పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల గురించి సీఎం ఆరా తీశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు.
Similar News
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.
News April 20, 2026
పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.