News April 28, 2024
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ మృతి చెందారు. కామారెడ్డి నుంచి కారులో తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు విధుల నిమిత్తం వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
NZB: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజగంగారం తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు 5 నెలల పాటు గ్రూప్-1, 2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 13, 2026
NZB: బెట్టింగ్ భూతం.. తీసింది ప్రాణం

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) గత కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్.. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.
News January 13, 2026
నిజామాబాద్: వారికి కలెక్టర్ హెచ్చరిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి కార్యక్రమానికి గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి తప్పుగా భావించి మెమోలిస్తున్నామని, పునరావృతమైతే వేతనాల్లో కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.


