News January 30, 2026

పార్వతీపురం: గిరిజన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

image

గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వినతులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్‌లో ఆయన పాల్గొని గిరిజనుల నుంచి 11 అర్జీలను స్వీకరించారు. ఐటీడీఏ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి, వారి సమస్యలనుఅడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 20, 2026

ఉమ్మడి ప్రకాశం: కీలక సమావేశానికి రంగం సిద్ధం.!

image

ఈ నెల 22న అమరావతిలో CM చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇన్‌ఛార్జ్‌లు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిని విడివిడిగా సమీక్షిస్తూ, అభివృద్ధిలో వేగం పెంచేందుకు CM దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

News February 20, 2026

ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

image

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్‌తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

News February 20, 2026

ఇతరుల చేతి నుంచి తీసుకోకూడని వస్తువులు ఇవే..

image

నూనె, ఉప్పు, గుడ్లు.. ఇతరులు ఇస్తున్నప్పుడు వీటిని నేరుగా చేతితో తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. వస్తు మార్పిడితో ఆ శక్తి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. అలా.. వీటిని తీసుకుంటే వారి నెగటివ్ ఎనర్జీ కూడా రావొచ్చు. తద్వారా వారి కష్టాలు, దోషాలు సైతం అంటుతాయని నమ్మకం. వీటిని కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.