News January 30, 2026

షాకింగ్: HYDలో ఆఫీస్‌లలో NO SAFETY!

image

HYDలో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని ఇటీవలి ఘటనలు కళ్లకుగట్టాయి. విస్తుపోయే నిజం ఏంటంటే GHMC హెడ్ ఆఫీస్‌, హైడ్రా ఆఫీస్‌లోనూ ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదనే విమర్శలున్నాయి. నగరంలో 99.99% భవనాలకు ఫైర్ NOC లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు కాగితాలకు పరిమితం అయ్యాయని పలువురి మాట. చట్టాలు అమలు చేసే కార్యాలయాలే ప్రమాదపు అంచున నిలబడటం శోచనీయం.

Similar News

News February 6, 2026

ఆదిలాబాద్: ప్రకృతి వ్యవసాయంతో లాభాలు: డీఏఓ

image

ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా, పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని డీఏఓ శ్రీధర్ స్వామి సూచించారు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానంలో జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 40 మందికి కృషి సఖిలకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక లాభాలు ఉన్నాయన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మల్లేష్ పాల్గొన్నారు.

News February 6, 2026

NZB: పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం రాత్రి పరిశీలించారు. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిశితంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 6, 2026

శ్రీవారిని ఉచితంగా దర్శించుకోండిలా!

image

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సాధారణ భక్తుల కోసం టీటీడీ పలు ఉచిత దర్శన మార్గాలను కల్పిస్తోంది. సర్వదర్శనం కోసం జనరల్ క్యూలో వెళ్లొచ్చు. టైమ్ స్లాట్ SSD టోకెన్స్‌తో పాటు మెట్ల నడక ద్వారా కొండపైకి వెళ్లి బయోమెట్రిక్ టోకెన్స్ పొందవచ్చు. స్థానిక భక్తులకు లోకల్ కోటా, సీనియర్ సిటిజన్లకు(65+) స్పెషల్ ఎంట్రీతో పాటు ఏడాదిలోపు పిల్లలున్న పేరెంట్స్ ‘సుపథం’ ద్వారా శ్రీవారిని వేగంగా దర్శించుకోవచ్చు.