News January 30, 2026
ఆదివారమూ స్టాక్ మార్కెట్.. చరిత్రలో రెండోసారి

సాధారణంగా స్టాక్ మార్కెట్లకు సండే సెలవు. కానీ వచ్చే ఆదివారం(FEB 1) NSE, BSE ఓపెన్‌లో ఉండనున్నాయి. ఆ రోజున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటమే దీనికి కారణం. ప్రభుత్వ పాలసీలు, ప్రకటనలపై ఇన్వెస్టర్లు స్పందించేందుకు వీలుగా ట్రేడింగ్ కొనసాగుతుంది. ఈక్విటీ మార్కెట్స్ ఆదివారమూ ఓపెన్‌లో ఉండటం చరిత్రలో ఇది రెండోసారి. తొలిసారి FEB 28(సండే), 1999న యశ్వంత్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడూ మార్కెట్లు పనిచేశాయి.
Similar News
News February 13, 2026
ఒకప్పుడు అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేది: చంద్రబాబు

AP: చట్టసభ అనేది ప్రజా దేవాలయమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేదని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించామన్నారు. సభలో సభ్యులకంటే స్టూడెంట్సే బాగా మాట్లాడారని ప్రశంసించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికలు.. ఖాతా తెరిచిన జనసేన

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 336 వార్డుల్లో పోటీ చేయగా ప్రస్తుతానికి ఓ చోట గెలుపొందారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పొత్తుతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 14వ వార్డులో విజయం సాధించారు. అక్కడ 15 వార్డులుండగా కాంగ్రెస్ 9 వార్డుల్లో, బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలిచాయి. దీంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది.
News February 13, 2026
ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. https://bie.ap.gov.in/ ద్వారా లేదా మన మిత్ర వాట్సాప్(9552300009) సేవల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు వీటిని డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని, ఫీజు బకాయిల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. కాగా FEB 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.


