News January 30, 2026
లైంగిక వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు: ASF కలెక్టర్

పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత హెచ్చరించారు. శుక్రవారం ASF కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత సేవా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాస్ – 2013పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లైంగిక వేధింపులకు గురైతే బాధిత మహిళలు 15100 హెల్ప్ లైన్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 2, 2026
అన్నపురెడ్డిపల్లి: 800 ఏళ్ల నాటి శ్రీవారి ఆలయ చరిత్ర!

అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు 800 ఏళ్ల ఘన చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలోని శిలాశాసనాల ప్రకారం.. క్రీ.శ. 1286లో కాకతీయుల సేనాధిపతి ‘అన్నపురెడ్డి’ తన ఇష్టదైవమైన వేంకటేశ్వర స్వామికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆయన పేరు మీదుగానే ఈ గ్రామానికి ‘అన్నపురెడ్డిపల్లి’ అని పేరు వచ్చినట్లు పూర్వీకులు చెబుతుంటారు.
News March 2, 2026
కామినేని శ్రీనివాస్ మాస్టర్ ప్లాన్.. కొల్లేరులో కొత్త పంట!

చేపల పెంపకానికి నెలవైన కొల్లేరులో మఖానా (ఫాక్స్ నట్స్) సాగుకు ప్రతిపాదన సిద్ధమైంది. స్థానిక సహజ వనరులతో అధిక ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో సూచించారు. కొల్లేరులో లభించే కలువ గింజల నుంచి మఖానా ఉత్పత్తి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు కొత్త ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మఖానా సాగుతో కొల్లేరు ముఖచిత్రం మారనుందని వివరించారు.
News March 2, 2026
SRCL: జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీపాదరావుకు ఘన నివాళి

సిరిసిల్లలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీపాదరావు సేవలను ఆయన కొనియాడారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


