News January 30, 2026
కల్లూరు: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 11న 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్ట్రాంగ్ రూములను బ్యాలెట్ బాక్స్‌లను స్టేట్ ఎన్నికల అబ్జర్వర్ పవన్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News February 2, 2026
ఖమ్మం జిల్లాలో 24 నామినేషన్ల ఉపసంహరణ

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎదులాపురంలో అత్యధికంగా 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. మంగళవారం ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్‌డ్రాలు జరిగే అవకాశం ఉంది.
News February 2, 2026
BREAKING.. ఏసీబీకి చిక్కిన ఖమ్మం తూనికల శాఖాధికారి

తూనికలు, కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ప్రవీణ్‌కుమార్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వేబ్రిడ్జి ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు ఓ ఏజెంట్‌ను రూ.10 వేలు డిమాండ్ చేయగా, రూ.5వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ రమేశ్ బృందం కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ప్రవీణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News February 2, 2026
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ అనుదీప్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి తక్షణమే శిక్షణ పూర్తి చేయాలని, కౌంటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో దుకాణాలు కోల్పోయిన వారి కోసం స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటుకు తగిన తీసుకోవాలని సూచించారు.


