News January 30, 2026
అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

AP: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం దాదాపు కొలిక్కి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. వారి ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ‘29,233 మందికి 69,421ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 1914 మందికి 7273 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. డ్రైన్లు నిర్మించాక సర్వే రాళ్లు వేయాలని రైతులు కోరారు. వర్షాకాలం నాటికి ప్లాట్లలో పూర్తి సదుపాయాలు కల్పిస్తాం’ అని కమిటీ భేటీ అనంతరం చెప్పారు.
Similar News
News February 13, 2026
కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్ కరీంనగర్ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి.
News February 13, 2026
BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామచందర్ రావు

TG: మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే BJPకి ఓటు శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. తమ పార్టీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. మొత్తం వార్డులు డివిజన్లు కలిపి 350సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నాం అని తెలిపారు. హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.
News February 13, 2026
తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు సంబంధమేంటి: CBN

AP: హెరిటేజ్ సంస్థ బ్రాండ్‌ను దెబ్బతీయడమే YCP ఉద్దేశమని CM చంద్రబాబు మండిపడ్డారు. అలా చేస్తే హెరిటేజ్‌కు నష్టం వస్తుందనేది వాళ్ల భావనని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదని అసెంబ్లీలో స్పష్టంచేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సున్నిత సమస్యని చెప్పారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు.


