News January 30, 2026
దేశ తొలి బడ్జెట్.. విశేషాలివే

బ్రిటిష్ పాలనలో APR 7, 1860 తొలి దేశ బడ్జెట్‌ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతంలో NOV 26, 1947న షణ్ముఖం చెట్టి బడ్జెట్ పద్దును పార్లమెంటులో వినిపించారు. AUG 15, 1947 నుంచి MAR 31, 1948 మధ్య కాలానికే దీన్ని ప్రవేశపెట్టారు.
* ఆదాయ అంచనా ₹171.15Cr(సాధారణ వసూళ్లు-₹88Cr, పోస్టు, టెలిగ్రాఫ్‌లు-₹15Cr)
* వ్యయం అంచనా ₹197.39Cr(రక్షణ-₹92Cr, మిగతా మొత్తం పౌర ఖర్చులు).
* లోటు ₹26 కోట్లు.
Similar News
News February 26, 2026
తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ వ్యాధి: వైద్యులు

ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియట్లేదని వైద్యులు చెబుతున్నారు. చక్కెర వల్లే షుగర్ వ్యాధి వస్తుందనుకోవడం అపోహ అని, వ్యాయామం చేయకపోవడంతో పాటు వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయని తెలిపారు. సన్నగా ఉన్నా, చిన్న వయసు వారైనా పరీక్షలు చేయించుకోవాలని.. బెల్లం, తేనె వాడినా షుగర్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
News February 26, 2026
సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ

AP: బిహార్ క్యాడర్ IPS సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. Dy.స్పీకర్ RRRపై YCP ప్రభుత్వ హయాంలో CID కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో గుంటూరు మొబైల్ కోర్టు ఈ వారెంట్‌ను ఇష్యూ చేసింది. పోలీసుల నోటీసులపై సునీల్ స్పందించకపోవడంతో ఇటీవల ఎస్పీ దామోదర్ బృందం బిహార్ వెళ్లగా అక్కడి హైకోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయలేదు. దీంతో GNT మొబైల్ కోర్టులో అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేశారు.
News February 26, 2026
కోళ్లలో రక్తపారుడు వ్యాధిని ఎలా గుర్తించాలి?

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.


