News January 30, 2026

ఎమ్మిగనూరులో విషాదం

image

ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువరాజు (43) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకోలేక, ఇంట్లో ఎవరి లేని సమయంలో మగ్గానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ఉషారాణి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 2, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. కలెక్టర్ సిరి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో వచ్చే ప్రజల అభ్యర్థనలను అధికారులు బాధ్యతతో పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు అర్జీలను నాణ్యతతో పరిష్కరించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 2, 2026

శ్రీశైలంలో నేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

image

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సమీక్ష సమావేశం జరగనుంది. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌ వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. సమీక్షలో పలువురు మంత్రులతోపాటు నంద్యాల, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం, నాగర్ కర్నూలు జిల్లాల శాఖల అధికారులు పాల్గొననున్నారు.

News February 2, 2026

కర్నూల్: 46 ఏళ్లకు ఒక్కటయ్యారు

image

1979-80 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల తర్వాత కర్నూలులో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మృతిచెందిన 15 మంది మిత్రులకు నివాళులు అర్పించారు. విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఉమ్మరాజు, చిన్న ఓబులేశు గౌడు రచించిన ‘శ్రీ శిర్డీ సాయి స్తోత్ర శతకం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.