News January 30, 2026
మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ సెకండ్ ఫిల్మ్?

‘రాజాసాబ్’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరోసారి డైరెక్టర్ మారుతితో మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈక్రమంలో హోంబలే ఫిల్మ్స్‌తో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ నిర్మాణ సంస్థతో మారుతికి అడ్వాన్స్ కూడా ఇప్పించారని తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Similar News
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.
News February 21, 2026
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

చలి తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో మిరప పంటలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.


