News April 28, 2024
ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల విడుదల
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 5,777 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. 1,445 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,404 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 209 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలపారు.
Similar News
News November 5, 2024
ఈనెల 9న CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు CM శ్రీశైలం పర్యటన ఖరారైంది. 9న విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ సేవలను CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి CM పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 5, 2024
కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించండి: టీజీ భరత్‌కు వినతి
మండల కేంద్రమైన కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసి నిర్మించాలని మంత్రి టీజీ భరత్‌కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మండలమైన కౌతాళంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.
News November 5, 2024
పారిశ్రామిక వాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: కలెక్టర్
ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై ఏపీఐఐసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు సంబంధించి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు.