News April 28, 2024
నేను ఫస్ట్ రాకుండా ఉండాల్సింది: యూపీ టాపర్
ముఖంపై అవాంఛిత రోమాల విషయంలో దారుణ ట్రోల్స్ ఎదుర్కొన్నారు యూపీ టెన్త్ పరీక్షల టాపర్ ప్రాచీ నిగమ్. ఆ ట్రోల్స్ పట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘బహుశా ఇంకొన్ని తక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిందేమో. అలా అయితే ట్రోలింగ్ తప్పేది. సామాజిక మాధ్యమాల్లో జనం ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇంజినీర్ అవ్వాలనేది నా కల. సాధిస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 3, 2025
ఫిబ్రవరిలో పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికలు!
TG: పంచాయతీ ఎలక్షన్లతో పాటు లేదా కొద్దిరోజుల గ్యాప్‌తో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల గడువు ముగియనుండగా సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసి FEB మొదటివారంలోగా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడకపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపాలిటీలకు ఆ సమస్య లేకపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News January 3, 2025
నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు HYDలోని హైటెక్స్‌లో జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించనున్నారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఎల్లుండి ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
News January 3, 2025
నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.