News January 31, 2026

బాపట్ల జిల్లాలో 61.370 కిలోల గంజాయి స్వాధీనం

image

బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల మూలాలను గుర్తించి, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 398 కేసులు నమోదు చేసి, 61.370 కిలోల గంజాయిని, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత నెలలో 3 కేసులు నమోదయ్యాయని, యువతను వ్యసనాలకు దూరం చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Similar News

News February 8, 2026

మమ్ముట్టి పేరు వెనుక ఆసక్తికర కథ

image

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. కాలేజీ రోజుల్లో తన పేరు పాతగా అనిపించడంతో ‘ఒమర్ షరీఫ్’గా పరిచయం చేసుకునేవారు. అయితే ఒకసారి పాకెట్ నుంచి ఐడీ కార్డు పడిపోవడంతో ఓ స్నేహితుడు మహ్మద్ కుట్టిని ‘మమ్ముట్టి’గా పిలిచాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. అదే చివరికి స్క్రీన్ నేమ్‌గా మారింది. తాజాగా ఆయన పద్మభూషణ్ అందుకున్నారు.

News February 8, 2026

KNR: పెరుగుతున్న పగటి పూట ఉష్ణోగ్రతలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శీతాకాలం ముగుస్తున్న వేళ ఎండల ప్రభావం క్రమంగా మొదలవుతోంది. రానున్న వారం రోజుల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో చలి తీవ్రత ఉన్నప్పటికీ, పగటి ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగా పెరుగుతున్నాయి. వారం ప్రారంభంలో 30°C గా ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత, వారాంతానికి 32°C నుండి 33°C కి చేరుకునే అవకాశం ఉంది.

News February 8, 2026

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.