News January 31, 2026
బాలికల పాఠశాలల్లో 100% టాయిలెట్ సదుపాయం: కలెక్టర్

ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో ఉన్న చిప్పగిరి, మద్దికెర, హోళగుంద మండలాల బాలికల పాఠశాలల్లో మార్చి 15 నాటికి 100 శాతం టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. హోళగుంద ZP హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అదనంగా 30 టాయిలెట్లు తక్షణమే నిర్మించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మరుగుదొడ్లు, తాగునీరు, పోషకాహారం వంటి వసతులు నిర్మించాలన్నారు.
Similar News
News February 7, 2026
వాయిస్ క్లోనింగ్ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు జిల్లాలో వాయిస్ క్లోనింగ్ ద్వారా జరిగే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. AI సాయంతో బంధువులు లేదా స్నేహితుల గొంతును క్లోన్ చేసి అత్యవసర సహాయం పేరుతో డబ్బులు అడిగే ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డబ్బులు పంపకుండా, తెలిసిన నంబర్‌కు స్వయంగా ఫోన్ చేసి వారి వివరాలు నిర్ధారించుకోవాలని సూచించారు.
News February 7, 2026
డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రజలకు మంచి సేవలు అందించి రిజిస్ట్రేషన్ శాఖకు మంచి పేరు రావాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ నుంచి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News February 6, 2026
లడ్డు వివాదంపై అసత్య ప్రచారాలు ఆపాలి: SV మోహన్ రెడ్డి

తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వివాదంగా మార్చడం తగదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లడ్డులో జంతు కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థల నివేదికలు స్పష్టం చేసినా, కూటమి నేతలు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.


