News January 31, 2026

నేను విన్నర్.. కింగ్ మేకర్‌ను కాదు: విజయ్

image

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. ‘నన్ను కింగ్ మేకర్‌ అనడం నాకు ఇష్టముండదు. కింగ్ మేకర్ అంటే మెయిన్ డ్రైవర్ కాదు.. సపోర్టర్. నేను గెలుస్తా. అలాంటప్పుడు కింగ్ మేకర్ ఎందుకవుతా? మా సభలకు వస్తున్న క్రౌడ్‌ను చూడట్లేదా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట తనను ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పారు. తన సినిమాలకు అడ్డంకులు వస్తాయని ముందే ఊహించానన్నారు.

Similar News

News February 18, 2026

క్లీనింగ్ టిప్స్ మీ కోసం..

image

* ముత్యాల నగలు మురికిగా అయితే ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తుడవండి.
* బట్టలపై నూనె పడితే ఉప్పు అద్దిన నిమ్మకాయతో రుద్దండి.
* షవర్ రంధ్రాలు మూసుకుపోతే, వైట్ వెనిగర్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
* ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
* బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో కీరదోసను ముక్కలుగా కోసి పెడితే, వాటి బెడద తగ్గుతుంది.

News February 18, 2026

నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

image

AP: కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రజాధనం ఖర్చు చేశారనే ప్రచారంపై మంత్రి లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?’ అంటూ పుష్ప స్టైల్లో సెటైర్ వేశారు. కాగా లోకేశ్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

News February 18, 2026

లవర్స్ డే: పూల కంటే వాటినే ఎక్కువ కొన్నారు

image

లవ్ అంటే రోజా పువ్వు అనే ఆలోచన క్రమంగా మారుతోంది. ఈ వాలంటైన్స్ డేకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గులాబీలు, గిఫ్ట్స్ కంటే కండోమ్స్, శృంగార అనుబంధ ప్రొడక్టులే అధికంగా కొన్నారు. క్విక్ కామర్స్ రిపోర్ట్ ప్రకారం బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ ఇందులో టాప్‌లో ఉన్నాయి. చాక్లెట్స్-2, టెడ్డీస్-3లో ఉండగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, HYD, చెన్నైలో ఈ ఆర్డర్లు ఎక్కువొచ్చాయి. కోల్‌కతాలో ఓవ్యక్తి ₹25K చాక్లెట్స్ కొన్నాడు.