News January 31, 2026
Dy.CMగా సునేత్ర.. కేటాయించే శాఖలివే..

దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఇవాళ సా.5 గంటలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కేటాయించనున్నారు. అంతకుముందు సునేత్రను NCP ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అటు అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి సునేత్ర పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తారు.
Similar News
News February 28, 2026
మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో UAEపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా మిస్సైల్స్ వదులుతోంది. ఈక్రమంలోనే దుబాయ్‌పైనా దాడులు చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో నుంచి అధికారులను ఖాళీ చేయించారు. ఇరాన్ దాడి చేస్తోందన్న సమాచారంతో సైరన్లు మోగించి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూతపడింది.
News February 28, 2026
కాకినాడ పేలుడు ఘటనపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

AP: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.
News February 28, 2026
యుద్ధం.. పెరగనున్న బంగారం, వెండి ధరలు!

ఇరాన్-ఇజ్రాయెల్, US మధ్య యుద్ధం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తారని, దీంతో వాటి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధం నేపథ్యంలో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. ఇక సోమవారం భారత మార్కెట్లు నష్టాల్లో కొనసాగవచ్చని, ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు.


