News January 31, 2026
కోడి పిల్లలకు ‘పుల్లోరం’తో ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
Similar News
News February 14, 2026
షుగర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే?

షుగర్‌తో బాధపడే మహిళల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ కావడం, శిశువులో అవకరాలు ఏర్పడటం వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే షుగర్ అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల అండం సరిగ్గా విడుదలవ్వడంతో పాటు తల్లీబిడ్డ ఆరోగ్యం బావుంటుందని సూచిస్తున్నారు.
News February 14, 2026
జాగ్రత్త.. ఓయో రూమ్స్‌కు ఆఫర్లు అంటూ..

వాలంటైన్స్ డే సందర్భంగా గతంతో పోలిస్తే ఈసారి హోటల్ రూమ్ బుకింగ్స్ 170% పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని ‘ఓయో’ ఆఫర్ల పేరుతో రూమ్స్ బుకింగ్స్‌పై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. కొందరు కూపన్లు అంటూ సోషల్ మీడియాలో పలు సైట్లు ఓపెన్ చేయాలని టెంప్ట్ చేస్తున్నారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని, లింక్స్ ఓపెన్ చేస్తే వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News February 14, 2026
షుగర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే?

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకొనే షుగర్ పేషెంట్లు పోషకాహార నిపుణుల సూచనతో డైట్ పాటించాలి. ముఖ్యంగా క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న పదార్థాలకు, డ్రింకులకు దూరంగా ఉండాలి. పండ్లు, కాయగూరలతో పాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పనీర్, పప్పులు, క్వినోవా, చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. ఓట్స్, మొక్కజొన్న, బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి.


